తన జీవితంలోనే అతిపెద్ద కష్టమైన పనిని భుజానికెత్తుకున్నారు నిర్మాత బండ్ల గణేశ్. అది అలాంటిలాంటి పని కాదు, నిజంగా ఆ పని ఆయన పూర్తిచేస్తే మామూలుగా ఉండదు. ఇంతకీ ఆ పని ఏంటో తెలుసా? పవన్ కల్యాణ్ తో డబ్బింగ్.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. చివరి దశకొచ్చిన 2 సినిమాల్నే పూర్తి చేయలేక ఇబ్బంది పడుతున్నారాయన. ఇక మూడో సినిమా సంగతి ఆ దేవుడికే తెలియాలి.
ఈ సినిమాలకు తోడు రాజకీయ-ప్రభుత్వ కార్యకలాపాలు ఉండనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు ఆయన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం స్పాండిలైసిస్ కు చికిత్స తీసుకుంటున్నారు.
ఇలాంటి టైమ్ లో ఓ శపథం చేశారు బండ్ల గణేశ్. ‘తీన్ మార్’ సినిమాను రీ-రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న ఈ నిర్మాత.. పవన్ తో మరోసారి పూర్తిస్థాయిలో డబ్బింగ్ చెప్పించి, వండర్ ఫుల్ మిక్సింగ్ తో థియేటర్లలోకి వస్తానని అన్నారు. పవన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా అనే కొత్త చర్చ మొదలైంది.
‘తీన్ మార్’ సినిమాకు లైవ్ డబ్బింగ్ చేశారు. దానిపై అప్పట్లోనే విమర్శలొచ్చాయి. డైలాగ్స్ సరిగ్గా వినిపించలేదని, అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయని కామెంట్స్ పడ్డాయి. అందుకే పవన్ తో మరోసారి స్టుడియోలో ప్రాపర్ గా డబ్బింగ్ చెప్పించి రీ-రిలీజ్ చేస్తానంటున్నాడు బండ్ల. ఇది జరిగే పనేనా?
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…
కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో…