చాలామంది ఇష్టంతో దర్శకులుగా మారతారు. కానీ దర్శకుడు బాబి మాత్రం కోపంతో దర్శకుడిగా మారానంటున్నాడు. ఇంతకీ అతడికి అంత కోపం ఎందుకు?
“రచయితగా లైఫ్ చాలా బాగుంటుంది. ఏసీలో కూర్చోవచ్చు, ఎండలోకి రానక్కర్లేదు. రైటర్ గా చేసినప్పుడు నేను బాగా ఎఁజాయ్ చేశాను. కాకపోతే నాకు ఒకటే కోపం. నన్ను ఎవ్వడూ గుర్తించట్లేదు. నాలుగు గోడల మధ్య విపరీతమైన గౌరవం వస్తోంది. కానీ ప్రెస్ ముందు దర్శకులు నా గురించి మాట్లాడ్డం లేదు. అది వాళ్ల తప్పు కూడా కాదు. ఆ కోపంతోనే నేను దర్శకుడిగా మారాను. ఆ కోపం నుంచే ‘పవర్’ అనే సినిమా చేశాను. నిజంగా నాకు రైటర్ గా మీడియా ముందు కూడా రెస్పక్ట్ ఇచ్చినట్టయితే, నేనసలు దర్శకుడిగా మారేవాడ్ని కాదు. నా భార్యకు కూడా పెద్ద కోరికల్లేవ్, హ్యాపీగా ఉండేవాళ్లం.”
ఇలా తన దర్శకుడిగా మారడం వెనక కథను బయటపెట్టాడు బాబి కొల్లి. బాలకృష్ణతో ‘డాకు మహారాజ్’ సినిమా తీసిన ఈ దర్శకుడు, ఆ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించాడు.
ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ‘యానిమల్’ సినిమా హిట్టయిన తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాబీనీ ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే బాబీ మాత్రం, యానిమల్ సినిమా రిలీజ్ కంటే ముందే బాబీకి ఈ కథ వినిపించాడట. ‘యానిమల్’ రిలీజ్ తర్వాత కూడా బాబీ డియోల్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించాడంటే, ఆ క్యారెక్టర్ లో ఉన్న లోతును అంతా అర్థం చేసుకోవాలంటున్నాడు బాబి.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…