నచ్చినట్టు, కావాల్సినంత ముందుగా షూట్ చేయడం, ఆ తర్వాత ఎడిట్ రూమ్ లో కట్ చేయడం పెద్ద సినిమాలకు కామన్ అయిపోయింది. మొన్నటికిమొన్న ‘పుష్ప-2’ సినిమాకు ఎంత కట్ చేశారో అందరం చూశాం. ఆ తర్వాతొచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాను కూడా ఎడిట్ రూమ్ లో బాగా కట్ చేశారనే విషయం సినిమా చూసిన ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతుంది.
మరీ ముఖ్యంగా రామ్ చరణ్, కియరా అద్వానీ లవ్ ట్రాక్ ను దాదాపు 80 శాతం కట్ చేశారు. ఇక ప్రియదర్శి ఎపిసోడ్ అయితే టోటల్ గా లేచిపోయింది. ఆ లిస్ట్ లో తను కూడా ఉన్నట్టు ప్రకటించారు బ్రహ్మానందం.
‘గేమ్ ఛేంజర్’లో బ్రహ్మానందం ఓ 2 సీన్స్ లో మాత్రమే ఇలా కనిపించి అలా మాయమౌతారు. అలాంటి చిన్న పాత్రలు ఎందుకు చేయాల్సి వస్తోందనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనిపై సూటిగా సుత్తిలేకుండా స్పందించారు బ్రహ్మి. ఆ సినిమాలో ప్రేక్షకులకు తన పార్ట్ చిన్నదిగా కనిపించినా, తను చేసింది చాలా పెద్దదని చెప్పుకొచ్చారు.
‘గేమ్ ఛేంజర్’ లో బ్రహ్మానందంపై కూడా భారీగా సన్నివేశాలు తీశారట. నిజానికి సినిమా కథకు, బ్రహ్మానందానికి మంచి లింక్ ఉందంట. అవేవీ సినిమాలో పెట్టలేదు. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అందులో కూడా రీ-లోడెడ్ వెర్షన్ లాంటిదేం పెట్టలేదు.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…