న్యూస్

Buchi Babu: జాన్వీ విషయంలో ట్రోలింగ్ పై స్పందన

‘పెద్ది’లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రను గ్లామర్ పరంగా అతిగా చూపించడంపై వచ్చిన విమర్శలపై దర్శకుడు బుచ్చి బాబు (Buchi Babu) స్పందించాడు. “ఈ రేంజ్ లో ట్రోలింగ్ వస్తుంది అని ఊహించలేదు,” అని అన్నాడు.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చయ్యమ్మ’ పాత్ర విషయంలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంత ప్రతికూల స్పందన వస్తుందని తాను అస్సలు ఊహించలేదని బుచ్చి బాబు తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో స్పందించాడు. ఐతే, తాను అనుకున్నది వేరు, జరిగింది వేరు అనిచెప్పాడు. ఆయన ఏమి అనుకున్నాడో, ఏమి తీశాడో ఆయనకే తెలియాలి.

ఈ సినిమాలో రామ్ చరణ్ నటన గురించి తెగ ప్రశంసలు వచ్చాయి. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక కలెక్షన్లు మాత్రం చాలా బాగున్నాయి. ఐతే, జాన్వీని చూపించిన తీరు, ఆమె పాత్రని మలిచిన విధానంపై మాత్రం బుచ్చిబాబుని అందరూ తిడుతున్నారు. అందుకే, ఈ ట్రోలింగ్ చూసి బుచ్చిబాబు భయపడినట్లు కనిపిస్తోంది.

ఐతే, భవిష్యత్తులో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చాడు బుచ్చిబాబు.

TeluguCinema

Recent Posts

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

3 hours ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

8 hours ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

9 hours ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

1 day ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

1 day ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

1 day ago