నటి చిత్రా శుక్లా మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఫొటోతో పాటు, చాలా ఫొటోల్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరో విషయం ఏంటంటే.. ఏ ముహూర్తంలో తనకు పెళ్లయిందో, అదే ముహూర్తంలో తొలి బిడ్డకు జన్మనిచ్చింది ఈ హీరోయిన్.
చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది చిత్ర శుక్లా. 2016లో శ్రీవిష్ణు సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, ఉనికి, తెల్లవారితే గురువారం లాంటి సినిమాల్లో నటించింది.
అయితే కెరీర్ లో ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న వైభవ్ ను పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల్లోనే వైభవ్ తో చిత్రాకు పరిచయం ఉంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది.
గతేడాది డిసెంబర్ లో వైభవ్-చిత్ర శుక్లా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడామె బిడ్డకు తల్లయింది. అన్నట్టు చిత్ర శుక్లా నటించిన ఓ 2 చిన్న సినిమాలు ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…