ఆగస్టు 15న అల్లు అర్జున్ నటిస్తోన్న “పుష్ప 2” విడుదల కానుంది. వినాయక చవితికి విజయ్ నటిస్తోన్న “G.O.A .T” రానుంది. దసరా పండగకి ఎన్టీఆర్ బిగ్ మూవీ “దేవర” ఫిక్స్ అయింది. దీపావళికి రామ్ చరణ్ సినిమా కానీ, రజినీకాంత్ మూవీ కానీ రావొచ్చు. ఇక ఈ ఏడాది మిగిలిన పెద్ద పండుగ క్రిస్మస్.
అందుకే, ఎనిమిది నెలల ముందే క్రిస్మస్ పండగకి కర్చీఫ్ వేస్తున్నారు ఇద్దరు హీరోలు. హీరో నితిన్ ఇప్పటికే తన తాజా చిత్రం “రాబిన్ హుడ్” డిసెంబర్ 20న విడుదల అవుతుంది అని ప్రకటించాడు. అంటే క్రిస్మస్ పండగకి ఐదు రోజుల ముందు. వీకెండ్ తో పాటు డిసెంబర్ 25న సెలవు కూడా కలిసి వస్తుంది అని ఆ డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాని “భీష్మ” దర్శకుడు వెంకీ కుడుముల తీస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కానీ ఇంతముందే విడుదల తేదీని ప్రకటించారు.
ముందే ప్రకటించడం వల్ల మిగతా సినిమాలు ఏవీ తన సినిమాతో పోటీ పడవని నితిన్ భావించి ఉంటారు. కానీ అలా జరగబోవడం లేదు. పండుగని క్యాష్ చేసుకోవాలని నాగ చైతన్య కూడా ఆరాటపడుతున్నాడు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు చందూ మొండేటి తీస్తున్న “తండేల్” షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాని కూడా డిసెంబర్ 20న విడుదల చెయ్యాలని టీం భావిస్తోంది. క్రిస్మస్ కి వస్తామని తాజాగా ఆ టీం మీడియాకి సమాచారం ఇచ్చింది.
మరికొద్ది రోజుల్లో డేట్ తో కూడిన పోస్టర్ విడుదల చెయ్యనున్నారు. సో, ఈ సారి క్రిస్మస్ కి నాగ చైతన్య వర్సెస్ నితిన్ పోటీ ఉంటుంది. అన్నట్లు ఈ ఇద్దరు హీరోలకు హిట్ అవసరం. వారి గత చిత్రాలు దారుణ పరాజయం పాలు అయ్యాయి.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…