దీపిక పదుకోన్ ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తమ కూతురికి ‘దువా’ అనే పేరు పెట్టారు దీపిక, రణ్వీర్ సింగ్. దీపిక కూతురుకి ఇప్పుడు ఆర్నెళ్లు నిండాయి. దాంతో, ఇక మళ్ళీ సినిమాలవైపు ఫోకస్ పెట్టాలనుకుంటోంది.
“నా కూతురిని వదిలి మళ్ళీ షూటింగ్ లు ఎలా చెయ్యాలి. పనికి వెళ్తే చిన్నపిల్లని వదిలేసి వచ్చాను అనే అపరాధ భావనను ఎలా ఎదుర్కోవాలి అని సందిగ్ధం ఇంకా వీడలేదు. అపరాధ భావన లేకుండా తిరిగి పని చెయ్యడం మెల్లగా అలవాటు చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాను,” అని తాజాగా దీపిక తెలిపింది.
కొత్తగా సినిమాలు ఒప్పుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని ఆమె చెప్పింది.
షారుక్ ఖాన్ వచ్చే ఏడాది “పఠాన్ 2” తీయాలనుకుంటున్నాడు. అలాగే ప్రభాస్ కూడా “కల్కి 2” సినిమాకి డేట్స్ వచ్చే ఏడాది ఇచ్చాడు. అంటే వచ్చే ఏడాదిలోపు దీపిక స్లిమ్ అయి మళ్ళీ రెడీ అవ్వాలి. ఈ రెండు సినిమాల్లో ఆమె నటించాలి.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…