రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న సినిమాకి “పెద్ది” అనే టైటిల్ అనుకుంటున్నారు అని చాలా కాలంగా ప్రచారం ఉంది. కానీ ఈ టైటిల్ పాన్ ఇండియాకి సూట్ అవుతుందా అని డౌట్ తో నిర్మాతలు ఇన్నాళ్లూ ఆగారు. ఐతే, ఇప్పుడు అదే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఆ టైటిల్ ని ప్రకటిస్తారు అని అభిమానులు చెప్తున్నారు. ఇప్పటికే టైటిల్ టీజర్ కి సంబంధించి పనులు ఊపందుకున్నాయి అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ పోస్ట్ లను షేర్ చేస్తున్నారు.
“పెద్ది” అనేది పేరు. ఆంధ్రా గ్రామీణ ప్రాంతంలో అలాంటి పేర్లు ఉంటాయి. పేరు కాబట్టి ఏ భాషలోనైనా ఒకటే ఉంటుంది కాబట్టి పాన్ ఇండియాకి ఇది సూట్ అవుతుంది అని ఫిక్స్ చేశారట. హీరో రామ్ చరణ్ పాత్ర పేరు ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. కబడ్డీ ప్రధానంగా సాగే ఈ కథలో రామ్ చరణ్ ఆటగాడిగా కనిపిస్తాడు.
రామ్ చరణ్ ఈ సినిమా కోసం బరువు పెరిగి, బాడీ పెంచాడు. గడ్డం, మీసాలు ఫుల్లుగా పెంచాడు. సో, ఈ నెల 27న రామ్ చరణ్ మొదటి లుక్, టైటిల్ విడుదల అవుతాయి అన్నమాట.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…