“యానిమల్” చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న “స్పిరిట్” (Spirit) చిత్రంలోనటిస్తోంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ విక్టోరియాస్ సీక్రెట్ (Victoria’s Secret) తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది.
చిన్నప్పటి నుంచి ఈ బ్రాండ్‌ను అభిమానించేదానినని త్రిప్తి తెలిపింది. ఈ సందర్భంగా తన ఫ్యాషన్‌పై ఉన్న అభిరుచి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
గతంలో కొత్త ట్రెండ్స్‌ను అనుసరించేదానినని, ఇప్పుడు మాత్రం తన వ్యక్తిత్వానికి సరిపోయే దుస్తులనే ఎంచుకుంటానని చెప్పింది. ఖరీదైన బ్రాండ్లు లేదా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ కంటే సౌకర్యం, ఆత్మవిశ్వాసం, సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించింది.
ప్రస్తుత తరం నటీనటులకు ఫ్యాషన్ ద్వారా తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉందని త్రిప్తి అభిప్రాయపడింది. సినిమా ప్రమోషన్ల సమయంలో దుస్తులు కూడా కథ చెప్పే ప్రక్రియలో భాగమవుతాయని, అయితే చివరికి ప్రేక్షకులు నటుడిని అతని లేదా ఆమె నటన ద్వారానే గుర్తుంచుకుంటారని చెప్పింది.
మొత్తానికి ఈ భామ తన పాపులారిటీని పెంచుకుంటోంది. అలాగే సంపాదన కూడా ఇలా బ్రాండ్స్ ద్వారా బాగా వస్తోంది. తెలుగులో ఆమె నటిస్తోన్న మొదటి చిత్రం ప్రభాస్ సరసన “స్పిరిట్”. హిందీలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…