న్యూస్

Kara: ధనుష్ ‘కర’ తెలుగు టీజర్

ధనుష్ (Dhanush) హీరోగా నటించిన తమిళ చిత్రం ‘కర’ (Kara) అదే పేరుతో తెలుగులోనూ వస్తోంది. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు.

ధనుష్‌కి జోడీగా మ‌మితా బైజు న‌టించింది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

టీజ‌ర్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. టైటిల్ పాత్ర‌లో న‌టించిన ధ‌నుశ్‌.. పాత్ర‌లో చాలా వేరియేష‌న్స్ క‌నిపిస్తున్నాయి. ఓ వైపు స‌మ‌స్య‌ను ఎదుర్కొనే యువ‌కుడిగా, మ‌రో వైపు భావోద్వేగాలు క‌ల‌గ‌లిసిన వ్య‌క్తిగా ఓ ప‌రిణితిగ‌ల పాత్ర‌లో మెప్పించ‌బోతున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

త‌న‌దైన స్టైల్లో ధ‌నుష్ పాత్ర‌లో ఒదిగిపోయార‌నే చెప్పాలి. జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీస్‌ అమల్లో పెడుతున్నారు మేకర్స్.

TeluguCinema

Recent Posts

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

18 hours ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

24 hours ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

1 day ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

1 day ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

2 days ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

2 days ago