అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో సినిమా ప్రకటన ఇటీవలే వచ్చింది. ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించనుంది సన్ పిక్షర్స్ సంస్థ. ఈ సినిమా కోసం హాలీవుడ్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ సంస్థలతో అట్లీ ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నాడు. దాన్ని బట్టి చెప్పొచ్చు… ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటుంది అని. అంతా భారీతనమే. దాదాపు 800 కోట్ల రూపాయలతో సినిమా తీయనున్నారు.
ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో విడుదల చెయ్యాలని, గ్లోబల్ ఆడియెన్స్ కోసం తీస్తున్నామని ఇప్పటికే నిర్మాణ సంస్థ తెలిపింది. అందుకే, ఈ సినిమాలో గ్లోబల్ లెవల్లో పేరున్న తారలను ఇతర ప్రధాన పాత్రల్లో తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ప్రియాంక చోప్రాని అడిగినట్లు వార్తలు వచ్చాయి.
ఐతే, ప్రియాంక చోప్రా అంతగా ఆసక్తి చూపలేదని టాక్. ఎందుకంటే ఆమె ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న మహేష్ బాబు మూవీ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రాజమౌళికి హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉంది. అందుకే, ఈ సినిమాపైనే ఆమె ఫోకస్. ఆ తర్వాత తాజాగా హృతిక్ రోషన్ తీయనున్న “క్రిష్ 4” చేయనుంది. హృతిక్ తో ఉన్న స్నేహం కారణంగా ఆ సినిమాలో నటించేందుకు వెంటనే అంగీకరించిందట.
ALSO READ: Priyanka Chopra in Demand in Tollywood
ఈ రెండు భారీ సినిమాల కారణంగా అల్లు అర్జున్ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యాలంటే ఇబ్బంది అవుతుంది అని ప్రియాంక ఆఫర్ ని తిరస్కరించినట్లు టాక్.
మరి ఇందులో నిజమెంతో చూడాలి. అల్లు అర్జున్ – అట్లీ సినిమా కూడా గ్లోబల్ లెవల్లో విడుదల కానున్న భారీ చిత్రమే. ఆ సినిమాలో నటిస్తే ఆమెకి ప్లస్సే కానీ మైనస్ అవదు. నిజంగా ఆమె నో చెప్పిందా లేక తర్వాత ఆలోచిద్దామని చెప్పిందా అనే విషయం తెలీదు కానీ సోషల్ మీడియా మాత్రం బన్నీకి ప్రియాంక నో చెప్పింది అంటూ తెగ ట్రెండింగ్ చేస్తోంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…