‘జైలర్’లో రమ్యకృష్ణ ఉంది కాబట్టి ‘జైలర్-2’లో కూడా ఆటోమేటిగ్గా తన పాత్ర కొనసాగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏం లేదు. కానీ ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఓ ప్రత్యేకమైన సందర్భాన్ని షేర్ చేశారు రమ్యకృష్ణ.
‘జైలర్-2’ షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజునే, రజనీకాంత్ తో కలిసి ఆమె నటించిన ‘నరసింహ’ సినిమా విడుదలై సరిగ్గా 26 ఏళ్లు అయింది. ఇదే విషయాన్ని ఆమె గుర్తు చేసింది.
‘నరసింహా’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పోషించిన అత్యంత శక్తిమంతమైన పాత్రల్లో అది కూడా ఒకటి. ఆ సినిమా టైమ్ లో రజనీకాంత్ ఫ్యాన్స్, రమ్యకృష్ణపై దాడులకు కూడా దిగారంటే, ఆ పాత్ర ఎంత పండిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ సినిమా తర్వాత రజనీకాంత్ తో మళ్లీ నటించే అవకాశం రాలేదు. ఎట్టకేలకు ‘జైలర్’తో రజనీ-రమ్యకృష్ణ మళ్లీ కలిశారు. ఈసారి కూడా హిట్ కొట్టారు. ఇప్పుడు ‘జైలర్-2’ చేస్తున్నారు.
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…