న్యూస్

Priyanka Mohan: ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో!

గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న ‘అరసన్’ (Arasan) సినిమాలో ఆమె ఎవరూ ఊహించని విధంగా పూర్తి డీ-గ్లామరైజ్డ్ రోల్‌లో కనిపించనుంది.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కేవలం పాటలకే పరిమితమయ్యే హీరోయిన్ పాత్రలకి భిన్నంగా, నార్త్ చెన్నై మురికివాడల నేపథ్యంలో సాగే ఈ రియలిస్టిక్ డ్రామాలో ఆమె లుక్, క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉండబోతున్నాయి. తన రెగ్యులర్ మేకప్, హంగులను పక్కనబెట్టి, పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది ప్రియాంక మోహన్.

వెట్రిమారన్ సినిమాల్లో మహిళాపాత్రలు ఎంత బలంగా, కథను మలుపు తిప్పేలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అరసన్’ చిత్రంలో కూడా ప్రియాంక పాత్ర అలాంటిదే అంటున్నారు.

తాజాగా ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. ప్రియాంక కూడా సెట్స్ లో జాయిన్ అయింది. ఆమె సెట్స్ పైకి వచ్చిన తర్వాతే, అది డీ-గ్లామర్ రోల్ అనే విషయం బయటకొచ్చింది.

విజయ్ సేతుపతి, సముద్రఖని లాంటి విలక్షణ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

TeluguCinema

Recent Posts

Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?

రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…

6 hours ago

ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3

సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…

13 hours ago

Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి

సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…

17 hours ago

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…

1 day ago

Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…

1 day ago

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…

1 day ago