“డబుల్ ఇస్మార్ట్” మొదటి ఈవెంట్ కు రెడీ అయింది. ఈ సినిమా నుంచి ట్రయిలర్ రెడీ అయింది. దీన్ని విడుదల చేయడానికి వైజాగ్ ను కేంద్రంగా ఎంచుకున్నారు. 4వ తేదీన వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో “డబుల్ ఇస్మార్ట్” ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు.
“డబుల్ ఇస్మార్ట్” టీజర్ ఇప్పటికే క్లిక్ అయింది. తాజాగా రిలీజ్ చేసిన పాటలు కూడా బాగున్నాయి. దీంతో ట్రయిలర్ పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, పూరి మార్క్, రామ్ మేనరిజమ్స్ మిస్సవ్వకుండా, పంచ్ డైలాగ్స్ తో ట్రయిలర్ కట్ చేశారు.
“డబుల్ ఇస్మార్ట్” ను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మి-పూరి కలిసి ప్రొడ్యూస్ చేశారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ. పూరికి ఇది ఇజ్జత్ కా సవాల్ అనుకోవచ్చు. ఆయన గత చిత్రం “లైగర్” ఘోరంగా పోయింది. ఇక రామ్ కూడా వరుస ఫ్లాప్ ల్లో ఉన్నాడు. ఇద్దరి కలిసి చేసిన ఈ సీక్వెల్ కచ్చితంగా ఆడాలి. రామ్ కి ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు ఉన్నాయి. కానీ, ఇది ఆడకపోతే పూరికి డేట్స్ ఇచ్చే హీరోలు కరువు అవుతారు.
పూరి, డబుల్ ఇస్మార్ట్, వైజాగ్, రామ్ పోతినేని
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…