బాహుబలి 2 సినిమా మొదటి వారం పూర్తి చేసుకొని రెండో వారంలోకి ఎంటరైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కూడా పూర్తయింది. బాహుబలి సిరీస్‌కి సంబంధించినంత వరకు ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అంటున్నాడు రాజమౌళి. ‘బాహుబలి’తో తన ప్రయాణం పూర్తైందని రాజమౌళి లండన్ నుంచి ట్వీటేశాడు. హీరోయిన్ అనుష్క, కీరవాణి, నిర్మాత శోభులతో కలిసి లండన్‌లో సినిమాని ప్రమోట్ చేశాడు.
బ్రిటిష్ ఫిల్మ్ సంస్థ కార్యాలయంలో స్టూడెంట్స్‌తో మాట్లాడాడు. అలాగే ఇతర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇక బాహుబలి సినిమా సిరీస్ పూర్తైపోయినట్టేనని ట్విటర్‌లో రాసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అనుష్క, శోభుతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు.
బాహుబలి 3 ఉండదు…
మరోవైపు బాహుబలి 2 సినిమాకి కొనసాగింపుగా బాహుబలి 3 ఉంటుందని మూడు రోజులుగా ప్రచారం ఊపందుకొంది. అయితే అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. మంచి కథ ఉంటే బాహుబలి సిరీస్‌ని పొడిగిస్తే తప్పు లేదని రాజమౌళి చేసిన కామెంట్‌ని పట్టుకొని బాహుబలి 2 గురించి ఊహాగానాలు అల్లేశారంతా.
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…