“పోకిరి” సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకొంది ఇలియానా. ఒక ఏడేళ్లు తెలుగులో ఆమె హవా నడిచింది. ఆ తర్వాత ఆమెని తెలుగు ఫిలింమేకర్స్ పట్టించుకోవడం మానేశారు. ఐతే, ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తెలుగు కెరీర్ ఏడేళ్ల తర్వాత మందగించడానికి కారణం ఇది అంటూ ఒక వివరణ ఇచ్చింది.
ఇలియానా చెప్పిన కారణం చూస్తే ఆమె బాలీవుడ్ మీడియా ముందు అసలు విషయం దాచేస్తోంది అని చెప్పొచ్చు.
“నేను బర్ఫీ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ వెళ్ళాను. ఆ సినిమా హిట్ కావడంతో నాకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగు దర్శక, నిర్మాతలు నన్ను పట్టించుకోలేదు. నేను తెలుగులో ఇక నటించను అని భావించారు వాళ్ళు,” అని తనకు తెలుగులో ఎందుకో క్రేజ్ పోయిందో చెప్పింది.
కానీ నిజం ఏంటంటే ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టే టైంకే ఆమెకి ఇక్కడ వరుసగా ఫ్లాపులు వచ్చాయి. “శక్తి”, “నేను నా రాక్షసి”, “దేవుడు చేసిన మనుషులు” వంటి దారుణమైన ఫ్లాపులు చూసింది ఆమె. ఆ టైంలో ఆడిన ఒకే ఒక్క మూవీ… జులాయి.
మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఆమెకి తెలుగు దర్శక నిర్మాతలే పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. అలా ఆమె నటించిన “అమర్ అక్బర్ ఆంటోని” దారుణంగా ఫ్లాప్ అయింది. అంతే అంతటితో ఆమె కేరీర్ కి ఎండ్ కార్డు పడింది తెలుగులో. ఇది అసలు విషయం. ఇలా చెప్పకుండా బాలీవుడ్ కి వెళ్లడం వల్ల తనని తెలుగు నిర్మాతలు పట్టించుకోలేదు అని చెప్తోంది.
ఇటీవలే ఈ భామ ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిగా బిజీగా ఉంది. అమెరికాలో నివసిస్తోంది.
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…
కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో…