Categories: న్యూస్

ఆ ఇద్దరి వల్లే సాధ్యమైంది: క్రిష్

పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” కథ దర్శకుడు క్రిష్ రాశారు. క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ వెంటనే అంగీకరించారు. దాంతో సినిమాని మొదలుపెట్టారు నిర్మాత ఏ.ఎం. రత్నం. ఐతే, షూటింగ్ విషయంలో తలెత్తిన విబేధాల కారణంగా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. క్రిష్ తప్పుకున్న తర్వాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ సినిమాని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు.

ఐతే, ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ క్రిష్ ని పొగిడారు. ఆయన కథ వల్లే ఇదంతా సాధ్యమైంది అని చెప్పారు.

దాంతో ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి మౌనం వహించిన క్రిష్ ఇప్పుడు స్పందించారు. సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్, రత్నంలని పొగిడారు.

“ఆ ఇద్దరి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం ఇద్దరూ ఇద్దరే. వారి పట్టుదల వల్లే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది,” అన్నట్లుగా సుదీర్ఘ పోస్టులో రాసుకున్నారు. ఇంతకీ తాను ఎందుకు తప్పుకున్నాడో చెప్పలేదు.

Admin

Recent Posts

Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?

రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…

11 hours ago

ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3

సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…

19 hours ago

Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి

సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…

22 hours ago

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…

1 day ago

Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…

2 days ago

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…

2 days ago