కుంభమేళాలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి వైరల్ అయిన సంగతి తెలిసిందే. పూసలమ్ముకునే ఆ అమ్మాయి ఫొటోని కొంతమంది తీయగా అది ఓవర్ నైట్ లో పాపులర్ అయింది. ఆ అమ్మాయికి ‘కుంభమేళా మోనాలిసా’ అనే ట్యాగ్ లైన్ కూడా వచ్చేసింది.
అంతేకాదు, ఆ అమ్మాయి అందానికి ముగ్దుడైన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, ఆమెకు తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఆఫర్ చేశాడు. ఇలాంటివన్నీ సాధారణంగా ప్రకటనలకే పరిమితం అవుతాయని, కార్యరూపం దాల్చవని అంతా అనుకుంటారు.
కానీ మిశ్రా మాత్రం ఆ అమ్మాయిని వెదికి పట్టుకున్నాడు. మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్ అనే ఊరిలో ఉన్న మోనాలిసా ఇంటికెళ్లాడు. ఆమెను తన సినిమాలోకి తీసుకుంటున్నట్టు చెప్పాడు. అక్కడికక్కడే అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడు.
అలా తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా.. మిశ్రా తీయబోయే ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చింది. మోనాలిసా చాలా అమాయకంగా ఉందని, ఆమెకు పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపాడు మిశ్రా. కంగనా లాంటి హీరోయిన్లు మోనాలిసాను ఇదివరకే మెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…