మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ నుంచి విడిపోయినప్పట్నుంచి మౌనంగా ఉంది మలైకా అరోరా. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె తన బ్రేకప్ పై పరోక్షంగా స్పందిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అర్థవంతమైన కొటేషన్స్ పెడుతూ, తన ఆలోచనలు పంచుకుంటూనే ఉంది.
తాజాగా ప్రేమపై మలైకా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. “ప్రయత్నమే ప్రేమకు ప్రాణవాయువు. అది లేకపోతే వేడి చల్లారిపోతుంది.” అనే పోస్ట్ పెట్టింది. ప్రేమను వ్యక్తం చేయడానికి, భాగస్వామికి దగ్గరవ్వడానికి చొరవ తీసుకోవడం చాలా ముఖ్యమని మలైకా అభిప్రాయం.
దీనిపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. మలైకా ఆశించిన చొరవను అర్జున్ కపూర్ చూపించలేదని, అందుకే వీళ్లు బ్రేకప్ అయి ఉంటారని అంతా చర్చించుకుంటున్నారు. దీనికంటే ముందు ఆమె మరో పోస్ట్ పెట్టింది. “మీ సమయాన్ని, ఉనికిని నిజంగా మీకు విలువనిచ్చే వాళ్లపైనే పెట్టండి” అంటూ పోస్ట్ పెట్టింది. ఇది కూడా అర్జున్ కపూర్ ను ఉద్దేశించి పెట్టిందేనంటున్నారు చాలామంది.
ఇలా బయటకు నేరుగా మాట్లాడకుండా, తన కొటేషన్స్ తో చాలా విషయాలు బయటకు చెప్పేస్తోంది మలైకా.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…