కీర్తి సురేష్ లవర్ విశేషాలు బయటకొచ్చాయి. చిన్నప్పుడు తనతో చదువుకున్న ఆంటోనీ తటిల్ ను ఆమె ప్రేమిస్తోంది. అంతేకాదు, వచ్చే నెల ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇంతకీ ఈ ఆంటోనీ తటిల్ ఎవరు..? ఏం చేస్తుంటాడు..? కీర్తిసురేష్ కు అతడిలో ఏం నచ్చింది?
ఆంటోనీ, కీర్తిసురేష్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత కూడా మరో ఏడాది కలిసి చదువు కొనసాగించారు. చిన్నప్పట్నుంచి ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలో పలు వ్యాపారాలున్నాయి. అందుకు తగ్గట్టే ఆంటోనీ అమెరికాలో బిజినెస్ మేనేజ్ మెంట్, ఇంజినీరింగ్ కోర్సులు చేశాడు.
ఆ తర్వాత అతడు ఖతార్ లో ఓ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. ఉద్యోగుల సైకాలజీ, వర్క్ కల్చర్ లాంటి ఎన్నో విషయాల్ని అక్కడ ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
అమెరికాలో చదువుతున్న టైమ్ లోనే కీర్తిసురేష్ కు ప్రపోజ్ చేశాడట ఆంటోనీ. చాన్నాళ్లు పెండింగ్ లో పెట్టి ఆ తర్వాత ఓకే చెప్పిందట కీర్తిసురేష్. ఆ తర్వాత అతడి కోసమే 2 సార్లు ఆమె దుబాయ్ కూడా వెళ్లొచ్చింది. వాళ్ల ఫస్ట్ డేటింగ్ దుబాయ్ లోనే జరిగింది.
అలా ఇద్దరూ ప్రేమలో ఒకటయ్యారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల గోవాలో వీళ్ల వివాహం జరగనుంది.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…