టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నాగార్జున ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ హీరోలుగానే కొనసాగుతున్నారు. భారీ హిట్స్ ఇస్తున్నారు. మరో సీనియర్ హీరో వెంకటేష్ అటు మల్టీస్టారర్ చిత్రాలు, ఇటు సోలో హీరో చిత్రాలు చేస్తున్నారు. కానీ ఆయనకి సక్సెస్ రేట్ అంతంత మాత్రమే. ఇక నాగార్జునకి హీరోగా సక్సెస్ రేట్ మొత్తంగా పడిపోయింది.
ఇటీవల ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో “నా సామి రంగ” ఒక్కటే ఎంతో కొంత కలెక్షన్లను సాధించింది. మిగతా చిత్రాలన్నీ ఘోర నష్టాలే చూశాయి. అందుకే, నాగార్జున ఇప్పుడు వేరే చిత్రాల్లో “కీలక” పాత్రలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర” చిత్రంలో నాగార్జున ఒక మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇందులో ధనుష్ హీరో. నాగార్జున కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉండే కీలక పాత్రలో కనిపిస్తారు. అలా అని ఆయన విలన్ కాదు. ఈ సినిమా విడుదల కాకముందే మరో పెద్ద సినిమాలో నాగార్జునకు ఒక కీలక పాత్ర దక్కింది.
ఐతే, నాగార్జున ఈ సినిమాకి ఇంకా ఓకె చెప్పాల్సి ఉంది.
నాగార్జున త్వరలోనే తన 100వ చిత్రం ప్రకటిస్తారు. తన కుమారులతో కలిసి నటించే ఈ భారీ చిత్రానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఐతే, హీరోగా ఏడాదికి ఒకటి మూవీ చేస్తూ, “కీలక” పాత్రలు ఎక్కువగా చెయ్యాలనేది నాగార్జున ప్లాన్.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…