Categories: న్యూస్

జూబ్లీహిల్స్ లో రెండు స్థలాలు

కరోనా అనంతర కాలంలో పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ లో రెండు స్థలాలు కొన్నారు. 2021లో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో 676 గజాల స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉంటున్నారు.

ఇక నెల క్రితమే అంటే మార్చి 2024లో ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లో వెయ్యి గజాల స్థలం కొన్నారు. ఈ వివరాలను పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎన్నికల సంఘానికి సమర్పించిన తన ఆస్తులు, అప్పుల వివరాల్లో పొందుపరిచారు. ఈ రెండు స్థలాలు కొత్తగా కొన్నవే. గతంలో ఆయనకున్న ఆస్తులకు అదనం. ఈ రెండింటి ఆస్తుల విలువ 31 కోట్ల రూపాయలుగా ఆయన పేర్కొన్నారు.

ఆయన గత నెలల్లోనే జూబ్లీహిల్స్ లో వెయ్యి గజాల స్థలాన్ని 16 కోట్లు పెట్టి కొనడం విశేషం.

మరోవైపు, తాను గత 5 ఏళ్లలో 114 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా మూడు సినిమాల్లో నటించారు కాబట్టి ఈ సంపాదన విషయంలో ఆశ్చర్యం ఏమి లేదు.

ఐతే పలువురి వద్ద దాదాపు 46 కోట్ల అప్పు చేసినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద 17 కోట్ల లోన్ ఉండగా, కొందరు నిర్మాతలు, తన వదిన సురేఖ సహా పలువురి నుంచి 46 కోట్ల మేర అప్పు తీసుకున్నట్లు చెప్పారు.

ALSO READ: Pawan Kalyan declares income of Rs 114 crore in five years

Admin

Recent Posts

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

2 days ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

2 days ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

2 days ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

3 days ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

3 days ago