నిహారిక కొణిదెలనిర్మాతగా మంచి విజయం సాధించారు. 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో డబ్బులు వచ్చాయి. పేరు వచ్చింది. అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రెండో చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మిస్తున్న నిహారిక తాజాగా ఆ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు.
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాల్లో నటించిన హీరో సంగీత్ శోభన్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఈ సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే
‘రాకాస’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. .ఆమెకిదే మొదటి సినిమా.
“సంగీత్ శోభన్‌ను సోలో హీరోగా పరిచయం చేస్తూ మేం స్టార్ట్ చేసిన సినిమాకు ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఇదొక ఫాంటసీ కామెడీ మూవీ. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక సాంగ్, నాలుగు రోజుల టాకీ పార్ట్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. సమ్మర్ సందర్బంగా ఏప్రిల్ 3న మూవీని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ నిర్మాతలు నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ అన్నారు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…