తెలంగాణ మాజీ మంత్రి, విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి సినిమాలంటే ఇష్టం. ఆయన అన్నా సినిమా వాళ్ళకీ ఇష్టం. బోళాతనం ఆయన పద్దతి. 70 ఏళ్ల వయసులో ఇప్పటికీ హుషారుగా ఉంటారు. తాజాగా ఆయన నితిన్ తో కలిసి డ్యాన్స్ చేశారు.
నితిన్ హీరోగా రూపొందిన కొత్త చిత్రం… “రాబిన్ హుడ్” . ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్… మల్లారెడ్డికి చెందిన కాలేజీకి వెళ్లారు. ఈ ఈవెంట్ లో నితిన్, మల్లారెడ్డి కలిసి “అది దా సర్ ఫ్రయిజ్” అనే పాటకు డాన్స్ చెయ్యగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
ఈ సినిమా కోసం నితిన్ తెగ ప్రమోట్ చేస్తున్నాడు. ఆ మధ్య వెంకటేష్ తన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకి ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారో అలా నితిన్ అన్నిచోట్లాకి తిరిగి తన సినిమాకి ప్రచారం కల్పిస్తున్నాడు. ఈ సినిమాపై నితిన్ నమ్మకంగా ఉన్నాడు. పూర్తిగా వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా జనాలకు కనెక్ట్ అవుతుంది అని భావిస్తున్నాడు.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన “రాబిన్ హుడ్” ఈ నెల 28న విడుదల కానుంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…