“వార్ 2” సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై ఒక డ్యాన్స్ పాట తీయడం మొదలుపెట్టింది టీం. ఐతే, ఈ పాట కోసం హృతిక్ రిహార్సల్ చేస్తుండగా కాలు బెణికింది. దాంతో, డాక్టర్లు హృతిక్ ని 6 వారాల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారట. దాంతో, షూటింగ్ ని ఆపేశారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. వెంటనే దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా మొదలుపెడుదామని అనుకున్నాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు “వార్ 2” నెల, రెండు నెలల పాటు షూటింగ్ లేకుండా నిలిచిపోవడంతో ఎన్టీఆర్ కి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది.
రెండు నెలలు ఆగి “వార్ 2” పూర్తి చేసి .. ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చెయ్యడమా లేక ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో ఇప్పటి నుంచే పాల్గొనడమా అనేది తేల్చుకోలేక డైలమాలో పడ్డట్లు కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 2026లో విడుదల చెయ్యాలనుకుంటే మాత్రం ఎన్ఠీఆర్ ఇప్పటి నుంచే షూటింగ్ మొదలు పెట్టాలి.
“వార్ 2” సినిమాని ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదల వాయిదాపడే అవకాశం లేదు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…