డిఫరెంట్ రోల్స్ పోషిస్తోంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న ఈ పాప, ఈమధ్య మంగళవారం అనే సినిమాతో మరోసారి మెరిసింది. ఇలా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి అదే పద్ధతి ఫాలో అయింది ఈ పొడుగుకాళ్ల సుందరి.
కెరీర్ లో తొలిసారి ఖాకీ చొక్కాలో కనిపించింది పాయల్. సిన్సియర్ పోలీసాఫీసర్ గా పాయల్ చేసిన సినిమా పేరు రక్షణ. ఒకప్పుడు నాగార్జున నటించిన సినిమా టైటిల్ ఇది. మళ్లీ ఇన్నేళ్లకు పాయల్ రిపీట్ చేసింది.
ఇక సినిమా విషయానికొస్తే.. ఇప్పటివరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, ఆసాంతం కట్టిపడేసే స్టోరీ ఇందులో ఉందంటున్నారు. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ కనిపించబోతోంది.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రక్షణ కథ రాసుకున్నాడు దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్. ఈ సినిమాకు నిర్మాత కూడా అతడే. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…