కల్కి సినిమాకు లీకులు కొత్త కాదు. ఓవైపు ఫ్రమ్ ది స్క్రాచ్ అంటూ మేకర్స్ మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఫస్ట్ లుక్స్ విడుదల చేసినప్పటికీ.. ఈ సినిమా అంతకంటే ముందు లీకుల బారిన పడుతూనే ఉంది. తాజాగా మరోసారి కల్కి సినిమా లీక్స్ రూపంలో వార్తల్లోకెక్కింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తను ఈ సినిమాలో నెగెటివ్ ఛాయల్లో కనిపిస్తానని స్వయంగా కమల్ హాసన్ కామిక్ కాన్ లో స్పష్టం చేశాడు. ఇప్పుడా గెటప్ లీక్ అయింది.
గుబురు గడ్డం, మీసాలతో కమల్ హాసన్ రఫ్ గా కనిపించే లుక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కల్కిలో కమల్ గెటప్ ఇదేనంటూ ఇప్పటికే ప్రచారం మొదలైంది. చాలామంది ఇదే కల్కి గెటప్ అంటున్నారు. మరికొందరు మాత్రం ఏఐ సహాయంతో దీన్ని తయారుచేసి ఉంటారని వాదిస్తున్నారు. ఆ ఫోటోని మేం ఇక్కడ పబ్లిష్ చెయ్యడం లేదు.
ప్రభాస్, దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కల్కి సినిమాలో అశ్వద్ధామ అనే కీలక పాత్రలో అమితాబ్, విలన్ పాత్రలో కమల్ కనిపించనున్నారు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…