సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీస్తున్న “కూలీ” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది. చాలా వేగంగా ఈ సినిమాని రజినీకాంత్ పూర్తి చేశారు. అలాగే, పలువురు పెద్ద హీరోలు ఇందులో నటిస్తున్నా, దర్శకుడు లోకేష్ పక్కా ప్లానింగ్ తో సినిమాని తక్కువ టైంలో పూర్తి చెయ్యడం విశేషం.
ఈ విషయాన్నీ చెప్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్షర్స్ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది.
రజినీకాంత్ ఈ సినిమాలో మెయిన్ హీరో అయినప్పటికీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన అక్కినేని నాగార్జున కీలకమైన రోల్ లో కనిపిస్తారు. కన్నడ అగ్ర హీరోల్లో ఒకరైన ఉపేంద్రకి మరో ప్రధానమైన రోల్ ఉంది. మలయాళ నటుడు సౌబిన్ కూడా నటిస్తున్నారు. శృతి హాసన్ రజినీకాంత్ కూతురిగా నటిస్తుండగా, పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఇంత భారీ తారాగణం ఉన్నా కేవలం 9 నెలల్లో షూటింగ్ ని పూర్తి చేశాడు లోకేష్.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్న టైంలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. లోకేష్ ఇప్పటికే “ఖైదీ”, “మాస్టర్”, “విక్రమ్” వంటి హిట్ సినిమాలు తీశాడు. అందుకే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…