పెళ్లి చేసుకుంటాడు అనుకున్న ప్రియుడు ఆ విషయంలో నాన్చుతుండడంతో అతనికి బ్రేకప్ చెప్పింది తమన్న. అంతేకాదు, చాలా తొందరగా ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడింది. మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది ఈ మిల్క్ బ్యూటీ. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన విజయ్ వర్మతో ఆమె ఇటీవలే తెగతెంపులు చేసుకుందన్న విషయం తెలిసిన మేటర్. ఇప్పటికే ఈ వార్త బాగా వైరల్ అయింది మరి.
ఇక బ్రేకప్ తర్వాత ఆమె ఒక పెద్ద సినిమా ఒప్పుకొంది. అది కూడా బాలీవుడ్ లోనే.
తమన్న ఒప్పుకున్న కొత్త చిత్రం.. మిషన్ మంగళ్. అజయ్ దేవగన్ సరసన నటించనుంది ఇందులో. ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు కానుంది. తమన్న ఇంతకుముందు అజయ్ దేవగన్ సరసన “హిమ్మత్ వాలా” రీమేక్ లో కూడా నటించింది.
మరిన్ని సినిమాలు కూడా చేస్తానంటోంది. ఆమెకి ఇటీవల హీరోయిన్ గా కన్నా బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ లకు క్రేజ్ పెరిగింది. “స్త్రీ 2” సినిమాలో ఆమె చేసిన ప్రత్యేక గీతం ఏకంగా 500 మిళియన్ వ్యూస్ పొందింది. ఒక్క యూట్యూబ్ లోనే ఈ వ్యూస్ అందుకొంది. దాంతో బాలీవుడ్ లో ఈ భామకి ఇలాంటి పాటలు, పాత్రలు ఇంకా వస్తూనే ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…