తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలను, మంత్రులను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే అసంతృప్తి మొదలైంది. మరీ ముఖ్యంగా ఈ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ (Konidela Surekha) ని సభ్యురాలిగా చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.
ముఖ్యంగా కొణిదెల సురేఖ నియామకంపై “స్థానికత” అంశాన్ని లేవనెత్తుతూ కాంగ్రెస్ అంతర్గత వర్గాలతో పాటు తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె సామాజిక, రాజకీయ నేపథ్యం అంతా ఆంధ్రప్రదేశ్‌తోనే ముడిపడి ఉందని, తెలంగాణ సెంటిమెంట్‌తో కూడిన పవిత్రమైన యాదగిరిగుట్ట బోర్డులో ఆంధ్రా మూలాలున్న వ్యక్తికి ఎలా చోటు కల్పిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
గత సంప్రదాయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, నల్గొండ జిల్లాకు అస్సలు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో ఆ ఆగ్రహం, సురేఖ వైపు టర్న్ అయినట్టు తెలుస్తోంది. కేవలం చిరంజీవి కుటుంబంతో ఉన్న వ్యక్తిగత సత్సంబంధాల కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
అంతే కాదు ఆమె ఇన్నేళ్లల్లో కనీసం ఒక్కసారైనా యాదగిరి గుట్టకి వెళ్ళారా? లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఒక్క సందర్భం, ఫోటో చూపించమని తెలంగాణ వాదులు అడుగుతున్నారు.
అయితే ఈ విమర్శల్ని మెగాభిమానులు గట్టిగా తిప్పికొడుతున్నారు. గత 35 ఏళ్లుగా సురేఖ, హైదరాబాద్ లోనే ఉంటున్నారని, ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఆమెను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…