రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకుడిగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు. తనే హీరోగా స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుపెట్టాడు. హీరోగా అతనికి ఇది 23వ చిత్రం (#RAPO23). దర్శకుడిగా మొదటి చిత్రం.
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా ఫైనలైజ్ అయ్యాడు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించిన తమిళ సంగీత దర్శకుడు సామ్ (Sam CS) ఈ సినిమాకి పని చేస్తున్నాడు. తెలుగులో “క” వంటి సినిమాలకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు సామ్.
నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నట్లు రామ్ తెలిపారు. హీరోయిన్ పేరు ఇంకా ప్రకటించలేదు.
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, తర్వాత హారర్ కామెడీలు, ఆపై పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలు… ఏ జానర్‌కు ఆదరణ లభిస్తే…
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం షూటింగ్…
కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…
తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…
ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…