అవీ ఇవీ

Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె కుమారుడు నీల్ కి ఇప్పుడు నాలుగేళ్లు. దాంతో ఆమె కొడుకుని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒప్పుకుంటుంది.

దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ కొత్త చిత్రంలో (NBK111) ఆమె ఇప్పుడు కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్‌ను బట్టి ఈ సినిమాలో గ్లామర్ కంటే హుందాతనానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా గ్లామరస్ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అని ప్రశ్నించగా, కాజల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

“గ్లామర్ పాత్రలు చేయనని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ తల్లి అయిన తర్వాత నా ఆలోచనా విధానం మారింది. నా కొడుకు పెద్దయ్యాక నా సినిమాలు చూసినప్పుడు అతనికి ఇబ్బందిగా అనిపించకూడదు. అందుకే అలాంటి సినిమాలకే నేను ఓకే చెబుతాను,” అని ఆమె చెప్పారు.

కాజల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, గ్లామరస్ పాత్రలను ఆమె పూర్తిగా తిరస్కరించడం లేదు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో చాలా సెక్సీగా కనిపిస్తూ ఫొటోస్ షేర్ చేస్తున్నారు. ఐతే ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు వేరు, పాత్రలు వేరు. సినిమా రోల్స్ విషయంలో ఆమె కొన్ని నియమాలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

TeluguCinema

Recent Posts

కమల్ హాసన్ కి కూతురు Shruti Haasan సపోర్ట్

కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…

4 hours ago

ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…

24 hours ago

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న Nagarjuna

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…

1 day ago

అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ…

1 day ago

ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse

'ఎల్లమ్మ' (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది.…

1 day ago

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

3 days ago