న్యూస్

కమల్ హాసన్ కి కూతురు Shruti Haasan సపోర్ట్

కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న విషయానికి చాట్ జిపిటి వంటి ఏఐ టూల్స్ పై ఆధారపడటం కంటే, పక్కనున్న స్నేహితులతో మాట్లాడి విషయాలు తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్పీచ్ ను శృతి హాసన్ (Shruti Haasan) సోషల్ మీడియాలో షేర్ చేసింది. తండ్రి కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవించింది.

ఏఐ టూల్స్ వాడిన ప్రతిసారి డేటా సెంటర్లు ప్రాసెసింగ్ కోసం భారీ మొత్తంలో విద్యుత్, నీరు వినియోగిస్తాయని కమల్ అన్నారు. చాట్ జిపిటిని ఒక ప్రశ్న అడిగినప్పుడల్లా ఒక గ్లాసు నీరు వృథా అవుతుందని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని కోరారు.

అనవసరమైన విషయాలు ఏఐని అడగడం మానేయాలని, మిగతా సమయాల్లో పక్కనే ఉన్న స్నేహితులతో చర్చించాలని సూచించారు. ఏఐ కంటే మన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర చాలా సమాచారం ఉంటుందన్న కమల్ కామెంట్స్ తో శృతిహాసన్ ఏకీభవించింది.

వ్యవసాయ రంగంతో పోలిస్తే ఏఐ ఎక్కువ నీటిని వినియోగిస్తుందనే వీడియోను షేర్ చేసింది.

ఏఐ గురించి అవగాహన పెంచుకోవడానికి 2024లో అమెరికా వెళ్లి 90 రోజుల కోర్సులో చేరారు కమల్. అయితే షూటింగుల వల్ల ఆయన 45 రోజులు మాత్రమే ఆ కోర్సుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏఐ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఏఐని చూసి భయపడాల్సిన అవసరం లేదనేది కమల్ మాట.

TeluguCinema

Recent Posts

Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…

4 hours ago

ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…

24 hours ago

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న Nagarjuna

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…

1 day ago

అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ…

1 day ago

ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse

'ఎల్లమ్మ' (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది.…

1 day ago

Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త

సోషల్ మీడియాలో హీరోయిన్లపై పడే కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా అంగాంగాన్ని వర్ణిస్తూ కామెంట్స్ పెడుతుంటారు కొంతమంది.…

3 days ago