‘ఎల్లమ్మ’ (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది. ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కీర్తిసురేష్ పేరు వినిపించింది. తను ప్రాజెక్టులో లేనంటూ కీర్తి స్వయంగా ప్రకటించింది.
ఆ తర్వాత మృణాల్ పేరు వినిపించింది. దాదాపు ఆమె పక్కా అనుకున్నారు. కానీ మృణాల్ కూడా ‘ఎల్లమ్మ’ లో చేరలేదు. ఇలా ఈ సినిమా చుట్టూ చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఆ లిస్టులో తన పేరు కూడా ఉందని తాజాగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కూడా బయటపెట్టింది.
“అవును.. ‘ఎల్లమ్మ’ సినిమా నాకు కూడా వచ్చింది. అది చాలామంచి కథ. కానీ అందులో నేను నటించలేకపోయాను. ఆ టైమ్ లో నేను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను. ‘ఎల్లమ్మ’ కు టైమ్ కేటాయించలేకపోయాను. అందుకే చేయలేనని చెప్పాను.”
ఇలా ‘ఎల్లమ్మ’ ప్రాజెక్టు తన దగ్గరకు కూడా వచ్చిన విషయాన్ని బయటపెట్టింది భాగ్యశ్రీ. వరుసగా పీరియాడిక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, మరికొన్ని రోజుల్లో ‘లెనిన్’ సినిమాతో థియేటర్లలోకి వస్తోంది.
'మిరాయ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు…
రవితేజ నటించిన "ఇరుముడి" (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు…
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…
తమిళనాట రాజకీయాల్లో ఒక బ్రేక్ కోసం బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. రజినీకాంత్ ని రంగంలోకి దింపి, ఆయనతో పార్టీ…
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…