ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు. వ్యక్తిగత జీవితం మొదలుకొని రాజకీయాల వరకు అనేక విషయాలు అందులో చర్చలోకి వచ్చాయి. దేశం, సమాజం, మతం, స్త్రీ స్వాలంబన… ఇలా అనేక అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఐతే, మిగతా విషయాలను అన్నింటిని వదిలేసి టీవీ మీడియా, వెబ్ సైట్లు, పత్రికలు, సోషల్ మీడియా ఆమె రెండో పెళ్లి గురించి చెప్పిన మాటలకే ప్రాధాన్యం కల్పించాయి. దాంతో రేణుకి చిర్రెత్తుకొచ్చింది.
“నా రెండో పెళ్లి గురించి వర్రీ కావడం మీడియా మానెయ్యాలి. ఇద్దరు ఎదిగిన పిల్లల తల్లిని. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు. ఎప్పుడు ఏమి చెయ్యాలో నాకు తెలుసు. నా రెండో పెళ్లి గురించి మీరు తెగ ఇదవకండి. మంచి జర్నలిజం చెయ్యండి,” అంటూ ఆమె మీడియాకి హితబోధ చేశారు.
రేణు దేశాయి, పవన్ కళ్యాణ్ తో విడిపోయాయి దాదాపు 13 ఏళ్ళు కావొస్తోంది. పవన్ కళ్యాణ్ మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మాత్రం పవన్ కళ్యాణ్, తనకు పుట్టిన పిల్లలను చూసుకుంటూ సింగిల్ గా ఉండిపోయారు. అందుకే ఆమె రెండో పెళ్లి గురించి ఎప్పుడూ చర్చే నడుస్తోంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…