“కుమారి 21 ఎఫ్” విడుదలైనప్పుడు ఇంత బోల్డ్ హీరోయినా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికీ, ఇప్పటికీ బోల్డ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ లో ఈ ‘కుమారి’దే అగ్రస్థానం. మరి ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను హీరోయిన్ హెబ్బా పటేల్ ఎలా ఒప్పుకుంది. దీనికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది హెబ్బా పటేల్.
“కుమారి 21 ఎఫ్ కథ మొత్తం నాకు చెప్పలేదు. షూటింగ్ కు వెళ్లకముందు రఫ్ ఐడియా ఇచ్చారు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత పూర్తి స్టోరీ చెప్పారు. నేను టైటిల్ రోల్ చేస్తున్నాననే విషయం కూడా సెట్స్ పైకి వెళ్లిన తర్వాతే తెలిసింది. నేనేం ప్లాన్ చేయలేదు, ఫ్లోలో అలా జరిగిపోయింది. వాళ్లు ఏం అడిగారో అదంతా చేశాను.”
ఇలా “కుమారి 21 ఎఫ్” సినిమా వెనక జరిగిన కథను బయటపెట్టింది హెబ్బా పటేల్. పైగా ఆ సినిమా టైమ్ లో తన కెరీర్ డౌన్ ఫాల్ లో ఉందని, కాబట్టి ఆ సినిమా చేయక తప్పలేదని తెలిపింది. ప్రతి రోజూ ఫ్రెష్ మైండ్ తో సెట్స్ కు వెళ్లేదంట హెబ్బా. దర్శకుడు ఏం చెబితే దాన్ని అలా చేసి చూపించేదట. అందుకే ఆ సినిమా తనకు పెద్దగా గుర్తులేదంటోంది.
ఈమె నటించిన ‘ఓదెల-2’ త్వరలోనే థియేటర్లలోకి వస్తోంది. ‘ఓదెల’ సినిమా ఎక్కడ ముగిసిందో, “ఓదెల-2” సరిగ్గా అక్కడే మొదలౌతుందని చెబుతోంది హెబ్బా పటేల్.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…