హీరోయిన్లలో డాక్టర్ అనగానే ఎవరికైనా శ్రీలీల గుర్తొస్తుంది. ఆమె ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఎంబీబీఎస్ పూర్తిచేసింది. అయితే ఇండస్ట్రీలో మరో డాక్టర్ కూడా ఉంది. ఆమె పేరు రూపా కొడువాయూర్. విశేషం ఏంటంటే, శ్రీలీలలా ఈమె కూడా తెలుగమ్మాయే.
అయితే శ్రీలీల కంటే ముందే మెడిసిన్ పూర్తిచేసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిన రూపా, ఎప్పటికైనా ఆంకాలజీలో మాస్టర్స్ చేయాలనేది తన డ్రీమ్ గా చెప్పుకొచ్చింది.దీనికి ఆమె కారణం కూడా వెల్లడించింది.
రూపా తల్లి కాన్సర్ పేషెంట్. అయితే సక్సెస్ ఫుల్ గా ఆమె కాన్సర్ ను జయించారంట. అప్పట్నుంచి రూపాకు ఎలాగైనా కాన్సర్ నయం చేసే డాక్టర్ అవ్వాలనే కోరిక కలిగిందంట. నిజానికి అంతకంటే ముందు ఆమె గ్యాస్ట్రో ఎంటరాలజీ చేయాలనుకుంది. తల్లిని చూసిన తర్వాత ఆంకాలజీ చేయాలని ఫిక్స్ అయిందంట.
ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఆంకాలజీ దిశగా అడుగులు వేస్తోంది రూప. లండన్ లో చదువుకుంటూ, పరీక్షలు క్లియర్ చేసుకుంటూ, మధ్యమధ్యలో సినిమాలు చేస్తోంది. ఇదీ రూపా చరిత్ర.
ఆమె నటించిన “సారంగపాణి జాతకం” విడుదలకు సిద్ధమైంది. ఆమె ఇంతకుముందు “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య”, “మిస్టర్ ప్రెగ్నెంట్” వంటి చిత్రాల్లో నటించింది. “సారంగపాణి జాతకం” ఆమెకి తెలుగులో మూడో చిత్రం. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…