జేమ్స్ కామరూన్, ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ కాంబినేషన్ లో వచ్చిన టెర్నినేటర్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే అంతా కళ్లు అప్పగించేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన ఈ సిరీస్ మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతోంది. అది కూడా హైటెక్ హంగులతో.
ఇందులో భాగంగా టెర్మినేటర్-2ను త్రీడీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆడియో క్వాలిటీని పెంచారు. సినిమాను త్రీడీలోకి కన్వర్ట్ కూడా చేశారు. ఆగస్ట్25న ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా టెర్మినేటర్-2 సినిమా విడుదలకానుంది.
అవతార్ తో జేమ్స్ కామరూన్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇక ఆర్నాల్డ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఈ సినిమాను టీవీల్లో ఇప్పటికే చాలామంది చూసేసినప్పటికీ.. థియేటర్లలో మరోసారి త్రీడీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు. ఇది క్లిక్ అయితే, సిరీస్ లో మిగతా భాగాల్ని కూడా త్రీడీలోకి మార్చే యోచనలో ఉన్నారు.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…