వరల్డ్ సినిమాలో హారర్ మూవీస్ కు కొదవ లేదు. ‘ఈవిల్ డెడ్’ నుంచి ‘కన్జూరింగ్’, ‘నన్’ వరకు చాలా సినిమాలు హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల్ని అలరించాయి. మరి ‘రాజా సాబ్’ ను ఈ కోవలోకి తీసుకోవచ్చా? ప్రభాస్ సినిమాలో అంత హారర్ ను ప్రేక్షకుడు తట్టుకోగలడా?
నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం ఇదే మాట చెబుతున్నారు. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ చూపించని విధంగా హారర్ ను ప్రభాస్ మూవీలో చూపించడం ఖాయమట. అయితే దీంతో పాటు కామెడీ కూడా ఉంటుందంటున్నారు.
“ఎవరూ ఊహించని స్కేల్ లో రాజా సాబ్ వస్తోంది. స్టోరీ, సెట్స్, గ్రాఫిక్స్.. ఇలా అన్నీ టాప్ క్లాస్ లో ఉంటాయి. వీటితో పాటు ఇది కామెడీ ఎంటర్ టైనర్. ప్రభాస్ ను ఓ డార్లింగ్ గా చూస్తారు. కామెడీతో పాటు లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్ చూస్తారు. దీంతో పాటు ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ తీయనంత సైజులో హారర్ ఉంటుంది.”
‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్ పై వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను అంగీకరించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
కొంతమంది విమర్శలు చేసినప్పటికీ అది సహజమన్నారు. ఫస్ట్ లుక్ లో ప్రభాస్ లుక్ మాత్రమే అసలైనదని, మిగతాదంతా గ్రాఫిక్స్ తో చేసింది కాబట్టి కాస్త వ్యతిరేకత రావడం జరిగిందట. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అసలైన కంటెంట్ చూస్తారని, ‘రాజా సాబ్’ కోసం ప్రత్యేకమైన ప్రచార వ్యూహాన్ని అనుసరించబోతున్నామని తెలిపారు
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…