విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం “జన నాయగన్”. ఇదే తన చివరి చిత్రం అని కూడా విజయ్ ప్రకటించాడు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీని బరిలోకి దింపుతున్నాడు. ఆ పార్టీ తరఫున అతను కూడా పోటీ చేసి సీఎం అవ్వాలని భావిస్తున్నాడు. అందుకే, ఇకపై సినిమాలు చెయ్యను అని హింట్ ఇచ్చాడు.
ఇది విజయ్ చివరి చిత్రం కాబట్టి చాలా అంచనాలు ఉన్నాయి. హైప్ కూడా అంతే స్థాయిలో ఉంది. ఐతే, సంక్రాంతి బరిలో మొదటి రోజే విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగులు, రాజకీయ పార్టీలపై విమర్శలు, హింసాత్మక దృశ్యాలపై సెన్సార్ అభ్యంతరం తెలిపింది. దీనిపై కోర్టుకు వెళ్లారు నిర్మాతలు. ఈ కేసు ఈనెల 20 తర్వాత మద్రాస్ హైకోర్టులో విచారణకు రానుంది.
సుప్రీం కోర్టు కూడా మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. దాంతో, విజయ్ వైఖరి ఏంటి? ఈ సినిమాని ఎలా విడుదల చెయ్యాలనుకుంటున్నాడు. ఒకవేళ కోర్టు ఇప్పటిలో తేల్చకపోతే సినిమా విడుదల కావడం కష్టం అవుతుంది. అందుకే, విజయ్ మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…