ప్రశాంత్ నీల్ హీరోలు ఎలా ఉంటారు? ఒక్కసారి ‘కేజీఎఫ్’ సినిమా గుర్తుకు తెచ్చుకోండి. అందులో యష్ దిట్టంగా కనిపిస్తాడు. అంతవరకు ఎందుకు, ‘సలార్’ సినిమానే తీసుకుంటే, అందులో ప్రభాస్ సాలిడ్ గా ఉంటాడు. ’10 మందిని నరికితే నమ్మేయాలి డూడ్’ అన్నట్టుంటాడు.
ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడో అందరూ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. అతడి ఫ్యాన్స్ అయితే ఇప్పటికే లెక్కలేనన్ని ఏఐ ఇమేజెస్ తో రెచ్చిపోయారు కూడా.
అయితే అలాంటి వాళ్లందరికీ ఇప్పుడో షాకింగ్ న్యూస్. అందరూ ఊహించినట్టు తారక్ సిక్స్ ప్యాక్ చేయడం లేదు, బల్కీగా తయారవ్వడం లేదు. కనీసం రెగ్యులర్ ఫిజిక్ కూడా మెయింటైన్ చేయలేదు. బక్కపల్చగా తయారయ్యాడు. అదే విచిత్రం.
అవును.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ సన్నగా మారిపోయాడు.
ఇంకా చెప్పాలంటే, ప్రశాంత్ నీల్ సినిమాల్లో సన్నగా కనిపించే హీరో బహుశా తారక్ ఒక్కడేనేమో. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో ప్రత్యక్షంకాబోతున్నాడు ఎన్టీఆర్.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…