‘L2 ఎంపురాన్’ సినిమా వివాదాస్పదమైన తర్వాత ఆ మూవీకి సంబంధించిన కీలక వ్యక్తులపై ఆదాయపు పన్నుశాఖ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్మాత గోపాలన్ పై ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది ఈడీ.
ఇప్పుడు ‘L2 ఎంపురాన్’ దర్శకుడు ఫృధ్వీరాజ్ సుకుమారన్ వంతు వచ్చింది. ఇతడికి కూడా తాజాగా నోటీసులందాయి. గత 3 చిత్రాల ఆదాయపు వివరాలు ఇవ్వాలంటూ ఐటీ, ఇతడికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 లోపు ఈ నోటీసులకు స్పందించాల్సి ఉంది.
రీసెంట్ గా పృథ్వీరాజ్ 3 సినిమాల్లో నటించాడు. గోల్డ్, జనగణమన, కడువా చితాలవి. ఈ సినిమాలకు అతడు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సహ-నిర్మాతగా లాభాలు తీసుకున్నాడు. దీనిపై ఐటీ ఆరాలు తీస్తోంది.
సహ నిర్మాతగా పృథ్వీరాజ్ సంపాదన 40 కోట్లు ఉంటుందని అంచనా. అధికారులు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కూడా ఆదాయపు పన్ను నోటీసులు రావడంతో, అంతా దీనికి ‘ఎంపురాన్’ వివాదంతో ముడిపెడుతున్నారు.
ఆ సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు, అంశాన్ని ఎత్తుకోవడం వల్లనే కొంతమంది ఇలా దర్శకనిర్మాతలను టార్గెట్ చేశారనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…