యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘జై లవకుశ’ టీజర్ రెడీ అవుతోంది. వచ్చేనెల మొదటివారంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై జై లవకుశ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలవకుశ సినిమా మొదట్నుంచి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం. రెండోది ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండడం. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ లో తారక్ కనిపించనున్నాడనే వార్త సినిమాపై ఇంట్రెస్ట్ ను డబుల్ చేసింది.
‘జై లవకుశ’ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ లోగో, ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. టీజర్ లాంచ్ తో సినిమా ప్రమోషన్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేసినట్టు అవుతుంది. సినిమాలో నివేదా థామస్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందితా రాజ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…