ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. హీరోయిన్లు కూడా సెట్ అయిపోయారు. ఇంకేముందని అంతా అనుకున్నారు. కానీ చాలామంది విలన్ విషయాన్ని మరిచిపోయారు. అవును.. ‘జైలవకుశ’ సినిమాకు మొన్నటివరకు విలన్ దొరకలేదు. ఎట్టకేలకు ఆ స్థానం భర్తీ అయింది బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ను జై లవకుశ సినిమాలో విలన్ గా తీసుకున్నారు.
మొదట ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ ను విలన్ గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు దునియా విలన్. అప్పట్నుంచి ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని రోనిత్ రాయ్ భర్తీ చేశాడు. ఈ విషయాన్ని అతడు స్వయంగా వెల్లడించాడు.
రోనిత్ రాయ్ సెలక్ట్ అవ్వడం, వెంటనే సెట్స్ పైకి రావడం కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రోనిత్ రాయ్ తో కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. రోనిత్ రాయ్ ను టీంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ట్వీట్ చేసింది.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…