అఖిల్ హీరోగా నటించిన “ఏజెంట్” సినిమా వేసవి సెలవుల్లో విడుదలైంది. దారుణ పరాజయం పాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సినిమా సెట్ మీదకు తీసుకెళ్లలేదు. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఒక భారీ సినిమాని అఖిల్ ఒప్పుకొని ఆరు నెలలపైనే అయింది. కానీ అది ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు.
కొత్త ఏడాది 2024లోనే ఫ్రెష్ గా మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెడుతాడట. 2024 జనవరి, ఫిబ్రవరిలో యువి నిర్మించే సినిమా స్టార్ట్ చేస్తాడట. దాంతో పాటు మరో మూవీ కూడా మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సినిమా చేసే అవకాశం ఉంది.
అఖిల్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. అందుకే, ఈ కుర్ర హీరో బాగా డీలాపడ్డాడు. ముఖ్యంగా “ఏజెంట్” పరాజయం పాలయ్యాక బాగా షాక్ కి గురయ్యాడట. అందుకే మరో సినిమా స్టార్ట్ చేసేందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు.
ఐతే, 2024లో మాత్రం రెండు సినిమాలు స్టార్ట్ చేసి… రెండూ వచ్చే ఏడాదే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి రెండూ హిట్ ఐతే అఖిల్ కెరీర్ మంచి ట్రాక్ లో పడుతుంది. కనీసం ఒక్కటైనా బ్లాక్ బస్టర్ గా నిలిచినా అతనికి సంతోషమే.
Actress Huma Qureshi has heaped praise on Yash's upcoming pan-India action drama "Toxic: A Fairy…
Vijay Deverakonda penned a heartfelt birthday message for director Rahul Sankrityan, celebrating their long-standing association…
Actress Nabha Natesh says she plays one of the strongest roles of her career in…
Kayadu Lohar is fast emerging as one of the busiest actresses in South Indian cinema.…
ZEE5 Telugu has unveiled the trailer of its upcoming original series "Veerabhadruni Rahasyam – From…
It is now official. NTR and director Trivikram Srinivas have reunited for their next film,…