ప్రేమలో ఉన్నప్పుడు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. స్థాయిని బట్టి, సెలబ్రిటీ హోదాను బట్టి ఆ బహుమతుల విలువ మారుతుంది. అలియా భట్ కూడా అలాంటి ఓ ప్రత్యేకమైన బహుమతి అందుకుంది. ఆ గిఫ్ట్ పేరు మిల్క్ కేక్.
మిల్క్ కేక్ ఖరీదైన బహుమతి ఎలా అవుతుంది. సామాన్యుడు కూడా కొనుక్కోవచ్చు కదా? చాలామందికి ఆ సందేహం ఉండొచ్చు. కానీ అలియా అందుకున్న మిల్క్ కేక్ వెనక చాలా పెద్ద కథ ఉంది.
ప్రేమించుకున్న రోజుల్లో రణబీర్-అలియా కలిసి బల్గేరియాలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్నారు. అదే టైమ్ లో అలియా పుట్టినరోజు వచ్చింది. తన ప్రేయసికి మిల్క్ కేక్ అంటే ఇష్టమనే విషయం రణబీర్ కు తెలుసు.
లండన్ లో ఉన్న లెటో అనే కేఫ్ లో చేసిన మిల్క్ కేక్ వరల్డ్ ఫేమస్. అక్కడ్నుంచి విమానంలో మిల్క్ కేక్ ను బల్గేరియాకు తెప్పించి, అలియాకు బహుమతిగా ఇచ్చాడు రణబీర్. అది చూసి అలియా ఉబ్బితబ్బిబ్బయింది. రణబీర్ కు కూడా పెట్టకుండా మొత్తం తినేసిందట.
హీరోహీరోయిన్ల గత విషయాలు బాలీవుడ్ లో వైరల్ అవ్వడం సర్వసాధారణం. గతేడాది అలియా చెప్పిన ఈ మేటర్, ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
The makers of King Jackie Queen (KJQ) have unveiled the theatrical trailer of the much-awaited…
Actress Ritika Nayak, who recently tasted success with “Mirai,” is gearing up for the release…
Actor Ram Charan has successfully undergone surgery for a right wrist injury that worsened during…
“Chennai Love Story” is currently running well in theaters. Released in cinemas on July 24,…
The makers of “Aadarsha Kutumbam” have unveiled the film's first promotional video, introducing Venkatesh as…
Bollywood star Ranbir Kapoor is currently focused on promoting “Ramayana,” which is slated for a…