‘టక్ జగదీష్’ సినిమా సెప్టెంబర్ 10కి అమెజాన్ లో విడుదల కానుంది అన్న టాక్ తో ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద యుద్ధమే జరిగింది.
సెప్టెంబర్ 10న ‘లవ్ స్టోరీ’ థియేటర్లలో విడుదల అవుతుంది అని మేం ప్రకటించిన తర్వాత అదే రోజు ఓటిటి వేదికపై ఎలా రిలీజ్ చేస్తారు? థియేటర్ల వ్యవస్థను చంపేస్తారా?” అన్న రేంజులో నిర్మాత సునీల్ నారంగ్ ఫైర్ అయ్యారు. ఆయనకు మద్దతుగా తెలంగాణ థియేటర్ల సంఘం హీరో నానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. ఆ తర్వాత వాళ్లే సారీ చెప్పారు. వివాదం ఇప్పుడు సద్దు మణిగింది.
ఇక తాజా సమాచారం ప్రకారం… ‘టక్ జగదీష్’, నితిన్ ‘మాస్ట్రో’, ‘లవ్ స్టోరీ’… ఈ మూడు సినిమాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని టాక్ నడుస్తోంది.
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ ముందు చెప్పినట్లే సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 9న హాట్ స్టార్ లోప్రీమియర్ కావాల్సిన మూవీ రెండు రోజులు లేట్ గా, సెప్టెంబర్ 10న అమెజాన్ లో స్ట్రీమ్ కావాల్సిన ‘టక్ జగదీష్’ ఆ తర్వాత వారం వచ్చేలా మాట్లాడుకున్నారట. ఐతే, ఇది ఈ సినిమా నిర్మాతల మధ్య జరిగిన ముచ్చట. దానికి స్ట్రీమింగ్ కంపెనీలు ఒప్పుకోవాలి. స్ట్రీమింగ్ సైట్ లు నిర్మాతల మనవి మన్నిస్తే ఏ సమస్య ఉండదు.
త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రావొచ్ఛు. ఇప్పటికే హాట్ స్టార్ ‘సెప్టెంబర్ 9న మాస్ట్రో స్ట్రీమింగ్’ అనే లైన్ ని తమ సోషల్ మీడియా నుంచి తొలగించింది. అమెజాన్ కూడా క్లారిటీ ఇస్తే సరిపోతుంది.
What's "I, Nobody" About? Rajeev (Prithviraj Sukumaran) is a middle-class government employee leading a routine…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Shriya Saran continues to…
Varun Tej's horror-comedy "Korean Kanakaraju" (KOKA) will arrive in theatres worldwide on August 7. The…
Actress Samyuktha Menon has been finalized as the female lead in Ram Pothineni's upcoming film,…
Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena Party president Pawan Kalyan has left for…
Young actor Roshan Kanakala has signed a new sci-fi entertainer, which was formally launched on…