“నాగేశ్వరరావు” పేరుతో నాగ చైతన్య హీరోగా దర్శకుడు పరశురామ్ ఒక సినిమా ప్లాన్ చేశారు. కానీ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాన్ని పక్కన పెట్టేశారు పరశురామ్. అలాగే, “రామారావు” పేరుతో బాలయ్య హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ కాంబినేషన్లో మూవీ అయితే ఉంది కానీ. టైటిల్ ఎగిరిపోయింది.
రవితేజ హీరోగా దర్శకుడు శరత్ మండవ తీస్తున్న సినిమాకి ‘రామారావు’ అనే పేరు ఖరారు చేసి ఈ రోజు అనౌన్స్ చేశారు
ఈ సినిమా పూర్తి టైటిల్ “రామారావు ఆన్ డ్యూటీ”. అదే పేరుతో ఫస్ట్ లుక్ విడుదలైంది. కానీ సింపుల్ గా ఈ మూవీని రామారావు అనే పిలుస్తారు. నిజాయితీ, దూకుడు ఉన్న ప్రభుత్వ అధికారి బి. రామారావుగా ఇందులో రవితేజ కనిపించనున్నారు.
అలా, “రామారావు” టైటిల్ రవితేజ ఖాతాలోకి వెళ్ళింది. ఇక, బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తీసే సినిమాకి వేరే టైటిల్ వెతుక్కోవాలి.
After facing repeated delays and two consecutive box-office disappointments, actor Nikhil Siddhartha has assured fans…
Akkineni Nagarjuna is delighted with the success of “Lenin,” which has grossed over Rs 23…
Nidhhi Agerwal is looking to turn the page after back-to-back setbacks at the box office.…
Akhil Akkineni and Bhagyashri Borse-starrer “Lenin,” which released in theatres on July 10, witnessed a…
The makers of “Ramayana,” one of the most anticipated films in Indian cinema, have officially…
Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, is all set to make her Telugu…