మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ కి అండగా నిలిచిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు ఆయనకి ఝలక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు గుడ్‌బై చెప్పుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తన ప్యానల్ ఇది అంటూ నిన్న ప్రకాష్ రాజ్ ఒక లిస్ట్ ప్రకటించారు. అందులో జీవిత రాజశేఖర్ పేరు కూడా ఉంది. ఆమె పేరుని చూసి తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు బండ్ల గణేష్. ఆమెకి పోటీగా ఉంటాను అని అంటున్నారు.
మెగాస్టార్ ఫ్యామిలీని జీవిత ఎన్నోసార్లు కించపరిచారనే ఉద్దేశంతోనే అతను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నారట.
“మాట తప్పను … మడమ తిప్పను. నాది ఒకటే మాట -ఒకటే బాట. నమ్మడం -నమ్మినవారికోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను -నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను – పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను…….మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు … నన్ను పోటీ చెయ్ అంటోంది.. అందుకే ఈ పోటీ… అందరికీ అవకాశం ఇచ్చారు… ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా ..” అంటూ బండ్ల వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు.
“వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం.. దానికోసం పోరాడతా… వారి సొంత ఇంటి కల నిజం చేస్తా.. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు… ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు…గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు … అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాంముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం… అదే మా నిజమైన అభివృద్ది… చిహ్నం… ఇట్లు మీ బండ్ల గణేష్,” అని ట్వీట్ చేశారు.
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Rashi Singh was busy…
The success of "Maa Inti Bangaaram" has turned even more special for Samantha. Megastar Chiranjeevi…
Vadde Naveen was one of the stars of the 1990s in Telugu film industry. Though…
The iconic mystery franchise "Marmadesam" is making a comeback with a new chapter, "Veerabhadruni Rahasyam…
Kajal Aggarwal has shared exciting details about her role in NBK111, the upcoming action entertainer…
At a time when even big-budget and star-driven films are finding it difficult to secure…