సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తీస్తున్న “గుంటూరు కారం” చిత్రంలో హీరోయిన్ గా మొదట తీసుకున్నది పూజ హెగ్డేని. పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా, రెండో హీరోయిన్ గా శ్రీలీల అనుకున్నారు. కానీ, కొన్నాళ్ళకు పూజ హెగ్డేని తప్పించారు. ఆమె స్థానంలోకి శ్రీలీల ప్రమోషన్ పొందింది. శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా మారింది.
పూజ హెగ్డేని ఎందుకు తప్పించారు అనే విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ వాటిలో ఒక్కటీ కూడా నిజం లేదని తాజాగా నిర్మాత నాగవంశీ మీడియాకి తెలిపారు. “బయట వినిపిస్తున్న కారణాల్లో ఒక్కటీ కూడా నిజం కాదు. ఆమె డేట్స్ విషయంలో వచ్చిన ఇబ్బంది వల్లే శ్రీలీలని తీసుకున్నాం,” అని నాగవంశీ తెలిపారు.
బయటికి వచ్చిన పుకార్లలో నిజం లేదనడం వరకు ఓకె కానీ పూజ హెగ్డే డేట్స్ ఇవ్వలేకపోయింది అన్నది మాత్రం అబద్దం అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు.
ఎందుకంటే… ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా లేదు. గత ఆరు నెలలుగా ఆమె ఒక కొత్త సినిమా సైన్ చేసేందుకు కష్టపడుతోంది. సినిమాలు లేక ఆమె ఖాళీగా ఉంది. అలాంటి డేట్స్ ఇవ్వలేకపోయింది అంటే ఎవరైనా ఎలా నమ్ముతారు?
నిజం చెప్పలేక ఎదో “ఒక” జవాబు ఇచ్చినట్లు ఉంది నాగవంశీ. హీరో మహేష్ బాబు వద్దనడం వల్లే పూజని మార్చాల్సి వచ్చింది అనేది ప్రధానంగా వినిపించిన పుకారు.
“గుంటూరు కారం” షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…
Putting an end to months of speculation and recent rumors, the makers of “Toxic” have…
Ravi Teja has wrapped up the shooting of his portions for “Irumudi”, directed by Shiva…
The makers of Kiran Abbavaram’s upcoming romantic drama "Chennai Love Story" have unveiled a new…
Prabhas and director Sandeep Reddy Vanga have joined forces for the much-awaited action thriller "Spirit",…
Samantha’s comeback film "Maa Inti Bangaaram" has opened strongly in North America, crossing the half-million-dollar…